![]() |
![]() |

మన మల్లీశ్వరి కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్. ఆయన నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని చెబుతూ విడుదల చేసిన పోస్టర్‌కి, టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. సెప్టెంబర్ 22న విడుదల కానుంది ఈ మూవీ.
టీజర్లో విక్కీ కౌశల్ తన పరివారాన్ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీలో పలు సమస్యలను విక్కీ ఎలా డీల్ చేశారనేది ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాను ఆడియన్స్ తమ ఓన్ రిస్కుతో చూడాలని హింట్ ఇచ్చారు విక్కీ. ఇందులోని ఎమోషనల్ కంటెంట్ వల్ల అవతలివారికి ఏమైనా ఇబ్బందులు కలిగితే తన ప్రమేయం ఏమీ లేదని సరదాగా చమత్కరించారు. ఎంటర్టైన్మెంట్కీ, ఎగ్జయిట్మెంట్కీ కొదవే ఉండదని అన్నారు.
మనోజ్ పహ్వా, కుముద్మిశ్రా, సడియా సిద్ధికీ కీ రోల్స్ చేశారు ఈ సినిమాలో. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ కాగానే రెడ్ హార్ట్ ఎమోజీలు వెల్లువెత్తాయి. ఫైర్ ఎమోజీలకైతే కొదవే లేదు. అనదర్ బ్లాక్ బస్టర్ ఆన్ ద వే అంటూ రాసుకొచ్చారు ఫ్యాన్స్. ఫ్యామిలీలతో కలిసి తప్పక చూస్తామని విక్కీకి భరోసా ఇస్తున్నారు ఫ్యాన్స్.
ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీతో పాటు విక్కీ కౌశల్ శ్యామ్ బహదూర్ సినిమాలో నటిస్తున్నారు. మేఘన గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న మూవీ అది. డిసెంబర్లో రిలీజ్‌కి రెడీ అవుతోంది.
మానుషి చిల్లర్ సమ్రాట్ పృథ్విరాజ్ తర్వాత చేసిన సినిమా ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ. త్వరలోనే వరుణ్‌తేజ్‌తో ఆపరేషన్ వేలెంటైన్లో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు. నార్త్ లో జాన్ అబ్రహామ్‌తో టెహ్రాన్ విడుదలకు సిద్ధమవుతోంది.
![]() |
![]() |